20% మధ్యంతర భృతి ప్రకటించాలి
తాడేపల్లి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే 20 శాతం మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ (ఐ ఆర్) ప్రకటించాలి.
ఉద్యోగ ఉపాధ్యాయలకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలి అని ఏపీ టీచర్స్ జేఏసీ చైర్మన్ ఏపీ టీచర్స్ జేఏసీ చైర్మన్ ఎం కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏపీ ఉపాధ్యాయ జేఏసీ ప్రథమ సమావేశం జరిగింది . ఈ సమావేశం చైర్మన్ ఎం కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృష్ణ ,గుంటూరు, జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి మాట్లాడుతూ పిజిటిలకు పూర్తిస్థాయి స్కేలు, సీనియర్ హెచ్ఎంలను ప్రిన్సిపాల్ గా పదోన్నతులు కల్పించడానికి కృషి చేస్తామని గురుకులాల ఉపాధ్యాయలకు పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు పెంపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ముఖ్య సదస్సులు నిర్వహిస్తామని సెక్రటరీ జనరల్ పి అశోక్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ డి శ్రీను వివిధ సంఘాల నాయకులు ఎస్ శ్రీనివాసరావు డాక్టర్ డి ప్రభాకర్ రావు పి సుధీర్, రామ్మోహన్ డాక్టర్ ఐ సదాశివరెడ్డి డి ప్రభాకర్ తదితర నేతలు పాల్గొన్నారు.