తేదీ : 27/09/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); గత ముప్పై ఒక్క ఏళ్ల నుండి ఓ పత్రిక గన్నవరం విలేఖరుగా ఎన్ .శ్రీనివాస్ రావు . పనిచేస్తున్నాడు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ పత్రిక పేపర్ బాయ్ నుంచి గన్నవరం విలేఖరిగా పొందొమ్మి ది వందల తొంబై నాలుగు సంవత్సరంలో చేరాడు. గన్నవరం మండలం, డివిజన్ కమిటీ సభ్యుడిగా, అదేవిధంగా పట్టణ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అతను చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆ పార్టీ కార్యాలయంలో ఉంటూ ఆ విధంగా పనిచేశాడు.
ఎస్ఎఫ్ఐ లో కూడా పనిచేస్తూ సభ్యుడిగా ఉన్నాడు. అప్పటినుండి ఆ ప్రాంత ప్రజలకు సుపరిచితులుగా ఉండడంవల్ల ఆయన మృతికి పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సంతాపం తెలిపారు. ఓ పత్రిక ఎడిటర్ బి. తులసీదాస్, చీఫ్ జనరల్ మేనేజర్ వై. అచ్యుతరావు, జనరల్ మేనేజర్ జీ. శివరామకృష్ణ, ఉమ్మడి కృష్ణా జిల్లా కన్వీనర్ యం.బి. నాథన్ , ఆ జిల్లా బాధ్యులు సి.హెచ్. కృష్ణ ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు, మండల కార్యదర్శి ఆంజనేయులు తదితరులు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అతను మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


