తేదీ : 26/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు ) లో ఘనంగా ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం అను సమగ్ర ఆరోగ్య కార్యక్రమం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఈనెల అనగా సెప్టెంబరు పదిహేడు వ తేదీ నుండి వచ్చే నెల అనగా అక్టోబరు రెండు వ తారీకు వరకు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడంతో వైద్యులు సల్మాన్ ఆధ్వర్యంలో మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ప్రణాళికల సిద్ధం చేయడమైనది.
ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యం పై అవగాహన, సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషక ఆహారాన్ని ప్రోత్సహించడం, కుటుంబాలను స్వశక్తి చేయడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడం, సంబంధిత అంశాలపై సూపర్వైజర్, సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, స్త్రీలకు వచ్చే జబ్బుల పై అవగాహన, వాటిని ఏ విధంగా తొలగిస్తే పోతాయి , గర్భిణీ స్త్రీలకు సంబంధించి అవగాహన , రక్తదాన శిబిరాలు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు అందించారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో పాల్గొని అవసరమైన ఆరోగ్య సేవలు పొందాలని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి వైద్యులు జి. గీత బాయ్ ఒక ప్రకటనలో తెలపగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గం, మండలం ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


