Distribution of New Clothes : గ్రామపంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ

TRINETHRAM NEWS

దేవరకొండ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ ఏ టీ కృష్ణ.

డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంల సేవ పక్వాడా భాగంగా గ్రామ పంచాయితీ కార్మికులకు మోదీ కానుకగా నూతన వస్త్రాలను ఇవ్వడం జరిగింది. అనంతరం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినం సందర్బంగా చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఏ టీ కృష్ణ మాట్లాడుతూ జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సేవా పక్వాడా పేరుతో నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు డిండి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ సుపరిపాలన క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు అందిందని భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఆ భగవంతుడు నరేంద్రమోడీకిఆయురారోగ్యాలు ఇవ్వాలని వేడుకున్నారు.

చిట్టచివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందిన్నాడే నిజమైన స్వాతంత్రం అని పేర్కొన్న మహనీయుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు సింకారు సైదాజీ. మాజీ ఎంపీటీసీ ఏటి రాధిక. పట్టణ బిజెపి అధ్యక్షులు బాదమూని సాయి గౌడ్. రాఘవేందర్. దండేడ్కర్ శీను. అమృత్.కటికర్ల అంజి. వావిళ్ళ శ్రీశైలం. పొలం సాయి. కామోజు అనీష్. బల్మూరి సందీప్.గుణముని వంశీ. తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of new clothes

You cannot copy content of this page

Scroll to Top