తేదీ : 16/09/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, కవులూరు, కృష్ణమ్మ గూడెం లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రకృద్ధిన్. అల్యీ హమన్, ఎస్. గోవిందరాజు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వ సమయం ప్రకారం పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద సన్న బియ్యం తో కూడిన అన్నము, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, పప్పు, రోజు విడిచి రోజు రాగిజావ, వేరుశెనగ గింజలు మరియు బెల్లం తో తయారు చేసినటువంటి చిక్కీలు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.
క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన , ఆటలు మొదలైనవి నేర్పిస్తున్నామని అన్నారు. సర్వేపల్లి .రాధాకృష్ణ విద్యామిత్రా సామాగ్రిని ప్రతి విద్యార్థికి అందించామని, విద్యార్థుల తల్లుల సంబంధిత బ్యాంకు ఖాతాలో తల్లికి వందనం పడ్డాయని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చినప్పటి నుండి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఆ బాధ్యతగా మేము చూసుకుంటున్నామని అనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని వివరించారు. విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మా వృత్తిని కొనసాగిస్తున్నామని ఆనందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


