National Employment Guarantee Scheme : జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్ల మొక్కలు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) నియోజకవర్గ ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం లో జాతీయ ఉపాధి హామీ పథకంద్వారా పండ్ల మొక్కలను ఏపిఓ అప్పలరాజు ఆధ్వర్యంలో , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం వారు పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నారని, ప్రసాద్ తెలియజేశారు. పంపిణీ చేసిన మొక్కలు సపోటా, కొబ్బరి, డ్రాగన్, ఆవకాడో మామిడి, పామాయిల్ వంటి ఆదాయాన్ని చేకూర్చే మొక్కలను ప్రభుత్వం వారు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేడిపోయిన చక్రధర్ రావు, వి ఆర్ పి రాజు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసులోవాలని ప్రసాద్ అన్నారు. అలాగునే కొయ్యూరు మండలం లొ మొత్తం 1563 ఎకరాల కు మొక్కలు పంపిణి చేయడం జరుగుతుంది అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Employment Guarantee Scheme..

You cannot copy content of this page

Scroll to Top