Mahila Congress : ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పొదిలి జ్యోతి

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరుపేదల పాలిట పెన్నిధి అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి తన ధ్యేయంగా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి ఎమ్మెల్యే పై బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీని గానీ ఎమ్మెల్యే కానీ విమర్శించే అర్హత బిజెపి నాయకులకు లేదు. ఎమ్మెల్యే పై అవినీతి అంటూ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము. ప్రతి పేదవాడికి కలలు కన్నా స్వరాజ్యం ఇవ్వాలి అని తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలి అని పేదవారు కన్నటువంటి కలలను నిజం చేయాలిఅని, ప్రతినిత్యం పేదవారి కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తులు జారే ఆదినారాయణ అలాంటి ఎమ్మెల్యే పై బిజెపి నాయకులు ఓర్చుకోలేక అవాకులు, చవాకులు, పేలుస్తూ ఉన్నారు. ముందుగా బిజెపి యొక్క అగ్ర నాయకులము అని చెప్పుకునే మీరు ఓట్లు చోరీ చేసి దొంగ రాజకీయాలు చేస్తూ మత రాజకీయాలు చేస్తూ ప్రజలని మభ్యపెడుతున్నారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరేంటి అనేది ఒకసారి చూసుకోండి. ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తే మాత్రం మహిళా కాంగ్రెస్ గా మేము చూస్తూ ఊరుకోము. ఖబర్దార్ జాగ్రత్త. పొదిలి జ్యోతి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

inappropriate comments about MLA

You cannot copy content of this page

Scroll to Top