CPI : అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన నాయకులు

TRINETHRAM NEWS

సిపిఐ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా ప్రతినిధులు.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభల్లో పెద్దపల్లి జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారని సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజు పేర్కొన్నారు. శుక్రవారం తో సిపిఐ రాష్ట్ర మహాసభలు ముగిసాయని, మహాసభల అనంతరం మహాసభ లో చేసిన తీర్మానాల ప్రకారం ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహాసభ లో పాల్గొన్న ప్రతి నిధులు తీర్మానం చేశారని ఆయన పేర్కొన్నారు. మహాసభ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద జిల్లా ప్రతి నిధి వర్గం నివాళులు అర్పించారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ మహాసభలో పాల్గొన్న వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ తో పాటు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leaders who paid homage

You cannot copy content of this page

Scroll to Top