MLC Pidisetti Raju : భారత రత్న, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ, జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

సిద్దిపేట జిల్లా :ఆగస్టు20,(హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం / కోహెడ మండలం ) భారత మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ 82వ, జయంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రయివేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణి చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు.
స్థానిక సంస్థలలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి భారతరత్న ,భారత మాజీ ప్రధాని,ఏఐసిసి మాజీ అధ్యక్షులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు ,రాజనీతిజ్ఞుడు,కారణ జన్ముడు,యుగ పురుషుడు రాజు కొనియాడారు. అదేవిధంగా ఐదు సంవత్సరాలపాటు భారత ప్రధాన మంత్రిగా, ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా అటు దేశానికి ,ఇటు పార్టీకి రాజీవ్ గాంధీ ఎనలేని సేవ చేశారు అన్నారు. ఓటు కనిష్ట వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి ఎక్కువ మంది యువతను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం చేసిన యువత పక్షపాతి రాజీవ్ గాంధీ అన్నారు.స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషిచేసిన మహిళ పక్షపాతి రాజీవ్ గాంధీ 73 ,74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసిన అసలు సిసలైన గాంధీయవాది రాజీవ్.
రాజీవ్ గాంధీ దేశంలో ఎలక్ట్రానిక్, సమాచార విప్లవానికి శ్రీకారం చుట్టారు. నేడు ప్రతి ఇంట్లో టీవీ ,ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను ఉన్నాయంటే దీనికి కారకుడు రాజీవ్ గాంధీ ఆయన జీవించింది కేవలం 47 సంవత్సరాల పాటే ఎన్నాళ్లు జీవించామని కాదు జీవించిన కాలంలో ఏమి చేశాము అనేది ముఖ్యం ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం అని రాజు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సాయికృష్ణ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్, పి.మాధవి, ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

82nd birth anniversary celebrations of India Rajiv Gandhi

You cannot copy content of this page

Scroll to Top