వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ : బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ బి.ఎఫ్.ఎస్.ఐ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పై టెక్స్ అకాడమీ వారిచే మంగళవారం విశ్వభారతి డిగ్రీ కాలేజ్ లో ఉచిత సెమినార్ నిర్వహించడం జరిగిందని టెక్స్ అకాడమీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ తెలియజేశారు.ఈ ఉచిత సెమినార్ లో బాగంగా విశ్వభారతి డిగ్రీ కాలేజ్ బి. కాం, బి. బి. ఎ, బి.ఎ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.టెక్స్ అకాడమీ విద్యార్థులకు బి.ఎఫ్.ఎస్.ఐ ఉచిత సెమినార్ లో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక సేవలు మరియు బీమా సేవలను. వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సహకార సంస్థలు, పెన్షన్ నిధులు, మ్యూచువల్ ఫండ్‌లు మరియు ఇతర సారూప్య సంస్థల గురించి ఉచిత అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గచ్చుమల్లె సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత సెమినార్ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధి అవకాశాల కొరకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
డైరెక్టర్ మట్టం బసవరాజ్ ఉచిత సెమినార్ నిర్వహించినందుకు టెక్స్ అకాడమీకు ధన్యవాదాలు తెలియ జేసారు.అనంతరం కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్ మోహన్ దాస్, మాట్లాడుతూ..ఈ ఉచిత సెమినార్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్,ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్న ఉద్యోగాలు, అవకాశాల గురించి తెలియజేశామన్నారు. ట్రైనర్ షేక్ షాహెన్షా విద్యార్థులు విద్యార్థినిలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో స్థిర పడాలని కోరారు.ఈ కార్యక్రమంలో టెక్స్ అకాడమీ సిబ్బంది,కళాశాల అధ్యాపకులు ,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


