త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దమ్మపేట మండలం సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు మందలపల్లి వద్ద అదుపు తప్పింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి బస్సు అదుపు తప్పి రోడ్డు ప్రక్కకు దూసుకెళ్లింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్రేక్ వెయ్యడం వలన టయర్స్ జారిపోయి రోడ్డు పక్కకు వెళ్ళింది. ప్రయాణికులు ఎంతో భయాందోళన చెందారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి ప్రమాదము జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


