Devarakonda MLA : స్వర్ణరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

అంగ రంగా వైభవంగా స్వర్ణ రథం ఉత్సవాలు.
దేవరకొండ ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్వర్ణరథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్యానా తాజా మాజీ గవర్నర్ దత్తాత్రేయ తో కలిసి ఎం ల్ ఎ బాలునాయక్ పాల్గొని, వాసవి మాత అమ్మవారిని వేద పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం మాడ వీధుల చుట్టూ తిరిగేందుకు ఏర్పాటు చేసిన స్వర్ణరథం అద్భుత శిలా కళా నైపుణ్యంతో అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.
దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలపై ఉండి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వైశ్యసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Devarakonda MLA participated Golden Chariot,

You cannot copy content of this page

Scroll to Top