CM Chandrababu : గందరగోళం సృష్టిస్తోంది వైసిపి

TRINETHRAM NEWS

తేదీ : 18/08/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి వైసిపి నిత్యం , విషం చిమ్మడం, తప్పుడు ప్రచారాలు చేయడమే అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాజధాని మునిగిపోయిందని , ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, వైసీపీకి సంబంధించి వాళ్ల సొంత ఓ పత్రిక, టీవీ ఛానల్లో అసత్య ప్రచారం చేస్తోంది. ఊర్లు మునిగిపోతున్నాయని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తప్పుడు ప్రచారాలతో గందరగోళం సృష్టించాలని చూస్తోంది .

ఈ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని మంత్రులకు మరియు పార్టీ నేతలకు పిలుపునివ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో రాష్ట్రం చీకటిమయం అయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఉదయించే సూర్యుడు వలె ఈ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు వెలుగు నింపుతుందని అన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి కుల, మత, భాష, పార్టీతో సంబంధం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. ఇకనైనా వైసిపి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. గ్రామ వార్డు స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రజలు ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. వైసిపి రాదు ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు నిర్మించిన అని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YCP is creating chaos

You cannot copy content of this page

Scroll to Top