AIDWA Demands : గిరిజన ప్రాంతాలకు ఫ్రీ బస్సు సర్వీసు అమలు చేయాలని ఐద్వా డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలలో ఉచిత బస్సు సేవ కీలకమని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తూనే గిరిజన ప్రాంతాల్లో మాత్రం మినహాయించడం దుర్మార్గమని విమర్శించారు. మహిళలు బస్సులు ఎక్కితే లోడ్ పెరుగుతుందన్న సాకులు ప్రభుత్వం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏజెన్సీ ప్రాంతంలో బస్సు సర్వీసులు తగ్గించారని, గిరిజన జనాభాకు తగ్గట్టుగా పల్లె వెలుగు బస్సులు, అదనపు రూట్లు వెంటనే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఫ్రీ టికెట్ సదుపాయం అన్ని రకాల బస్సులకు ఏసీ, లగ్జరీ, ఇతర రాష్ట్రాల సర్వీసులకూ వర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వి.జయ, జిల్లా జాయింట్ సెక్రటరీ కె.శశికళ, జిల్లా ఉపాధ్యక్షులు కుమారి, జిల్లా కమిటీ సభ్యులు సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

free bus service to tribal areas

You cannot copy content of this page

Scroll to Top