79th Independence Day : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగష్టు 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అధ్యక్షుడు ఎన్ వి టీ సభ్యులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినారు. అనంతరం ఎస్ బి ఐ దేవరకొండ శాఖ నందు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల భవనమునందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక వ్యక్తి లేదా సమూహం సమాజంలో వివక్ష లేదా పక్షపాతం లేకుండా జీవించగలగడం.
స్వాతంత్ర్యం అనేది ఒక వ్యక్తి లేదా సమూహం తమకు తాముగా నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వారి జీవితాలను నియంత్రించడానికి అవసరమైన హక్కు. ఇది వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధికి మరియు సంక్షేమానికి చాలా ముఖ్యమైనది అన్నారు. స్వాతంత్రం తెచ్చే పెట్టిన అమరవీరులని మరవరాదని దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ కోశాధికారి కృష్ణ కిషోర్ ఎస్ బీ ఐ చీఫ్ మేనేజర్ ఫణింద్ర, తాళ్ల సురేష్, పీ జె శాంసన్, రాజకుమార్ రెడ్డి, ఎన్ వెంకటరామ్, సముద్రాల వెంకన్న, వేణు, అమరేందర్, ఆంజనేయులు, సతీష్ గౌడ్, మాకం మహేష్, చంద్రశేఖర్, వంగూరు వెంకటేశ్వర్లు, నరేష్, జగదీశ్వర చారి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు, శ్రీను, సాయి, శాంతా నాయక్, రాజకుమార్, చక్రపాణి, శ్రీకాంత్, కలమ్మ, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రభాకర్, లతీఫ్, జి వెంకట రెడ్డి, సల్మాన్, పుతిలి బేగం, ఖాసిం, ప్రవీణ్ కుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top