పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా
అభివృద్ధిని మరిచి దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు
ఎన్ని దాడులు చేసిన వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
డిండి(గుండ్లపల్లి) ఆగష్టు 15 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం సింగరాజుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం డిండి మండలం సింగరాజుపల్లి మాజీ సర్పంచ్ పొనుగోటి రవీందర్ రావు శ్రీపతి బొడ్డయ్య, సురేందర్ రావు లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బిఆర్ఎస్ కార్యకర్తలలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే దాడులు చేయడం జరిగింది అని, ఈ కుట్రలు బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్థైర్యంను దెబ్బతియలేవు అని ఆయన అన్నారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా అని ఆయన భరోసా ఇచ్చారు.గ్రామాలలో అభివృద్ధి చేయకుండా దాడులకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారు అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేయడం దారుణం అన్నారు.ఎన్ని దాడులు చేసిన వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన అన్నారు.ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


