MLA Jare : 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. నేటి యువతరం నైతిక విలువలు శ్రమ సాంకేతికతతో దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ రోజు అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయం, రింగ్ రోడ్డు సెంటర్‌, ప్రెస్ క్లబ్ నందు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. అదేవిధంగా దమ్మపేట మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన జాతీయ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి పతాకావిష్కరణ చేసి వారిలో దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం అనేక త్యాగాల ఫలితమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కలల భారత నిర్మాణం కోసం ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. యువతరం నైతిక విలువలు శ్రమ సాంకేతికతతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana participated in  79th Independence Day

You cannot copy content of this page

Scroll to Top