Independence Day : డిండి మండల కేంద్రములో ఘనంగా 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) ఆగస్టు15. త్రినేత్రం న్యూస్. 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని డిండి మండల ప్రభుత్వ కార్యాలయాల్లో,ప్రభుత్వ మరియు పైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో, చైతన్య యువజన సంఘము, ముస్లిం మైనారిటి కమిటి, భారత రాష్టసమితి, దొంతినేని వెంకటేశ్వర రావ్ గెస్ట్ హౌజ్, స్పోర్ట్స్ క్లబ్ నందు జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు.తహసీల్దార్ కార్యాలయమునందు తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ జాతీయా పతకావిష్కరణ చెయ్యడము జరిగింది.
ఈ సందర్భంగా తహసీల్దార్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…మన స్వాతంత్ర్యం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితం. ఈ రోజు మనం పొందిన హక్కులు, స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుని ధర్మం. అభివృద్ధి, సమానత్వం, ఐక్యత పథంలో దేశం ముందుకు సాగేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ భక్తి స్ఫూర్తిని నింపే పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రదర్శనలు వేడుకలకు విశేష ఆకర్షణగా నిలిచాయి. బి. ఆర్. యస్ పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్,యూత్ అధ్యక్షులు మహమ్మద్ రషీద్, గుర్రం సురేష్, మొహమ్మద్ జాహంగీర్, ఖదీర్, చైతన్య యువజన సంఘము వద్ద మొహమ్మద్ ఖయ్యుమ్, షాదిఖానా వద్ద మైనారిటి కమిటీ అధ్యక్షులు షేఖ్ ఉమర్, యాదవసంఘము వద్ద బయ్యా మల్లయ్య, స్పోర్ట్స్ క్లబ్ వద్ద బాధమోని శ్రీనివాస్ గౌడ్, డి వి ఆర్ గెస్ట్ హౌజ్ వద్ద దొంతినేని వెంకటేశ్వర రావ్ , లు జాతీయపతాకవిష్కరణ చెయ్యడము జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పౌరులు వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top