ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలి.
వర్షాకాలం సమస్యలపై ముందస్తూ చర్యలకు ఆదేశాలు.
దేవరకొండ ఆగష్టు 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డులో విద్యుత్ శాఖ డైరెక్టర్ శివాజీ మరియు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాలాకాలం ప్రారంభం కావడంతో గాలివానలు వర్షాలు పిడుగులు చెట్లు విరిగి పడటం వంటి పరిస్థితులు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఏమి నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
గ్రామాల్లో చెట్లకు తగిలేతీగలో వంగినా లేదా పాడైన స్తంభాలను వెంటనే సరి చేయాలని, అదేవిధంగా పాడైన ట్రాన్స్ఫార్మర్లు ఫీజులు కనెక్షన్ లైన్లను ముందుగానే మరమ్మత్తు చేసుకోవాలని వర్షాకాలంలో అత్యవసర మనమత్తుల కోసం ప్రత్యేక రెస్క్ టీమ్లను ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు స్పేర్ పార్ట్స్ స్కూల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పంట సాగు కాలంలో రైతులకు విద్యుత్ సరఫరాలలో అంతరాయం లేకుండా పర్యవేక్షణ చేయాలి అని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్ పి డీసీఎల్ డైరెక్టర్ శివాజీ, సీజీఎం బిక్షపతి, ఆర్డీవో రమణారెడ్డి, కృష్ణారావు, డి ఈ విద్యాసాగర్, ఏడి సైదులు, సాగర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, ఏఈలు విద్యుత్ కాంట్రాక్టర్ సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


