Illegal Arrests : అక్రమ అరెస్టులు దురదృష్టకరం

TRINETHRAM NEWS

అక్రమ అరెస్టులను ఖండించిన A.T. కృష్ణ

డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 12 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ లోని పెద్దమ్మగుడి దగ్గర కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపు మేరకు డిండి మండలంలోని వివిధ గ్రామలలో నుండి బయలుదేరుతున్నారనే సమాచారంతో ముందస్తుగా అరెస్ట్‌లు చేసి డిండి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా BJP దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ A.T. కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెద్దమ్మగుడి దగ్గర కూల్చివేతలు చేపట్టడాన్ని హిందూ సంఘాలు భారీ ఎత్తున వ్యతిరేకించడం జరిగిందని,

ఈ నేపథ్యంలో హిందూ సంఘాల పిలుపు మేరకు చేపట్టబోయే కుంకుమార్చన కార్యక్రమాన్ని అడ్డుకోవడం తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టకరమని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రేవంత్ రెడ్డి పాలనలో స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఈ అరెస్ట్ అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు సింకారు సైదాజీ,జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు వావిళ్ల అంజి యాదవ్. గాయల రాఘవేందర్, మాధామోని అమృథ్, సాయి గౌడ్,తవిటి సందీప్ ,వావిళ్ల శ్రీశైలం. నల్లగాంతుల అనేష్. భూషిపాక సిద్దు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Illegal arrests are unfortunate

You cannot copy content of this page

Scroll to Top