త్రినేత్రం న్యూస్ రాజమహేంద్రవరం: ఆగస్టు : 11, పట్ బడిన 25 టన్నుల రేషన్ బియ్యం.. ప్రభుత్వం పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న 25 టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్, పౌరసంబంధాలు, రవాణా శాఖ అధికారులు దాడులు చేసి జాతీయ రహదారి పాలచర్ల సమీపంలో చెరుకూరి క్రషర్ సమీపంలో సోమవారం పట్టుకున్నారు. లారీలో నల్లజర్ల నుండి కాకినాడ పోర్ట్ కు అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరిస్తున్నారు అని సమాచారం రావడంతో తనిఖీలు చేస్తుండగా 25 బియ్యం గుర్తించారు. అయితే గత నెలలో 6ఎ కేసు నమోదు చేయగా గ్రామానికి తీసుకుని వెలుతున్నట్లు బియ్యం యజమాని చెప్పాడని అధికారులు తెలిపారు.
దీనిని కాకినాడ జిల్లా కలెక్టర్ దృవీకరణ చేయాల్సి ఉందన్నారు. రికార్డులు పరిశీలించి ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ అరెస్టు చేసి కేసు నమోదు చేశామని బియ్యం విలువ రూ.11 లక్షల 50 వేలు, లారీ విలువ రూ 10 లక్షలు ఉంటుందని తెలిపారు. దీనిలో విజలెన్స్ డిఎస్పి, ఇన్స్పెక్టర్, విజిలెన్స్ తహసీల్దార్ పవన్ కుమార్, సహాయ పౌరసరఫరాల అధికారి నాగాంజనేయులు, మండల పౌర సరఫరాల అధికారి గులుగూరి బాపిరాజు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, టెక్నీకల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


