త్రినేత్రం న్యూస్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, ఇటీవల ప్రైవేట్ హాస్పటల్స్ నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 36 మందికి రూ.20,13,759/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా సదరు చెక్కులను బుధవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చేతులమీదిగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


