Tribal Rights : ఆదివాసీ హక్కులను పరిరక్షిస్థాం

TRINETHRAM NEWS

సాంప్రదాయ నృత్యాలు పాటలతో అలరించిన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులు
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ ఆగష్టు 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో అధికారులు,నాయకులు,విద్యార్థులు,ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ప్రాచీన చరిత్రకు,సంస్కృతికి, సంప్రదాయాలకు,నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతం.ప్రకృతిమాత బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలుతెలియజేయడం జరిగింది.స్వాతంత్ర్య భారత దేశంలో ఆదివాసీ గిరిజన ప్రజలు ఇంకా సమానత్వం కోసం,హక్కులకోసం,పోరాటాలు చేస్తూ,భూమి కోసం,భుక్తి కోసం, వివక్ష లేని సమాజం కోసం ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నారని ఆదివాసీల హ‌క్కులను ప‌రిర‌క్షణ‌కు ప్రజా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
గిరి పుత్రులు, వనవాసీలు ప్రత్యేకమైన ఆచార,సంస్కృతీ, సాంప్రదాయాలను క‌లిగి ఉంటార‌ని చెప్పారు. ఆదివాసీలఉనికి,మనుగడ,హక్కుల పరిరక్షణకు గాను ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 9న ప్రపంచ ఆదివాసీదినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్యసమితి 1994 లో ప్రకటించిందని తెలిపారు. ఆదివాసీల అభ్యున్న‌తికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిక‌ట్టుబ‌డిఉన్నాడనితెలిపారు.
అనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కి రాఖీ కట్టిన పాఠశాల విద్యార్థులు,మహిళాఉపాధ్యాయులు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We protect the rights of the tribals

You cannot copy content of this page

Scroll to Top