MRPS Party : చేయూత వికలాంగులు పెన్షన్ దారుల బాధలు తీర్చే బ్యాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వనిది కదా

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఆగష్టు 6 ధర్మసాగర్ మండల కేంద్రంలోని తాటికాయల గ్రామంలో ఎర్ర రవీందర్ ఏం ఆర్ పీ ఎస్ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన గంగరపు శ్రీనివాస్ ఏం ర్ పీ స్ మండల ఇంచార్జి మరియు ఎం స్ పి జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఆగష్టు 7 న చేయూత దివ్యంగుల సన్నాహక సదస్సు హసీనపర్తి మండలం చింతగట్టులో గల ఏం టీ ఆర్ గార్డెన్లో వికలాంగుల చేయూత పెన్షన్ దారుల పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న జిల్లా మహాసభకు ధర్మసాగర్ మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుండి వృద్ధులు వితంతువులు వికలాంగులు దివ్యాంగులు గీత చేనేత కార్మికులు అందరు కూడా పెద్ద సంఖ్యలో జనం పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు
ఈ యొక్క జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటైన వికలాంగుల వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల చేనేత బీడీ గీత కార్మికుల పెన్షన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ పెన్షన్లు తీసుకునే వారికి వికలాంగులు అయితే 4000 పెన్షన్ ఉంటే 6000 చేస్తానని వృద్ధులు వితంతువులు , ఒంటరి మహిళలు చేనేత బీడీ గీత కార్మికులకు 2000 ఉన్న పింఛన్లు 4000 చేస్తామని నన్ను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓట్లు వేసి గెలిపించారు కానీ 20 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి పెన్షన్ పెంచకపోగా నాలుగు నెలల పెన్షన్ ఎగ్గొట్టాడని మరియు పెన్షన్ దారులను నమ్మించి మోసం చేశాడని అన్నారు పెన్షన్లు పెంచి ఇచ్చే వరకు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ దారులందరినీ ఐక్యం చేసి పోరాటం చేస్తామని దానిలో భాగంగానే ఈనెల 13న చలో హైదరాబాద్ లక్షలాది మందితో వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహా గర్జన ఉంటుందని.

దాన్ని విజయవంతం చేయడంలో భాగంగా 7 న మహాసభను నిర్వహిస్తున్నామని ఆ యొక్క సభకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా విచ్చేసి పెన్షన్ దారులతో మాట్లాడతారని కావున హనుమకొండ జిల్లాలోని 14 మండలాల పరిధిలోని ప్రతి గ్రామం నుండి వందలాదిగా వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత బీడీ గీత కార్మికులు పెన్షన్ దారులు మరియు కండరాల క్షీణతతో పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులు అందరూ మహాసభకు ప్రతి గ్రామం నుండి విచ్చేసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో పుట్ట ప్రశాంత్ మాదిగ ఏం ఆర్ పి స్ జిల్లా నాయకులుసింగారపు పవన్ మాదిగ బొల్లెపాక పోచయ్య బొల్లెపాక కొమురయ్య శివరాత్రి సారయ్యపట్ల యాదగిరి నల్ల రమేష్పెసరు పోషయ్య ఎర్ర జనార్ధన్పట్ల ఎల్లయ్య ఆమంచ రామలింగం ఎర్ర యాదగిరిఎర్ర యాదయ్య పట్ల పోచయ్య నాగబెల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

suffering of the disabled and pensioners

You cannot copy content of this page

Scroll to Top