AIYF : గ్రామ అభివృద్దే లక్ష్యంగా ఏ ఐ వై ఎఫ్.

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)ఆగష్టు 04 త్రినేత్రం న్యూస్. గ్రామ పరిపాలన ప్రభుత్వ అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనీ అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం తవక్లాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ,వారు నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేనియెడల పై అధికారుల దృష్టికి తీసుకుపోతామని హెచ్చరించారు .

విధులకు హాజరు కాని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలనీ అన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నల్లబోతుల మహేష్,కార్యదర్శిగా గోద మహేష్,కోశాధికారి ఎండి షమీద్, ఉపాధ్యక్షులు గంట శేఖర్,సహాయ కార్యదర్శిగా ఎండిఆదిల్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో (ఏఐటియు సి)జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు,సిపిఐ తవక్లాపూర్ గ్రామశాఖ కార్యదర్శి వంకేశ్వరం చక్రి, ఏ ఐ. వై,ఎఫ్.మండల అధ్యక్షులు ఎలిమినేటి నరేష్,మిద్దె సందీప్, ఎండి ఈసా, చెనమోని గణేష్,నూనె మల్లేష్,నారిమల్ల కిరణ్,యాతం సైదులు,మీనుగా నవీన్,కడారి జశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AIYF aims at village development

You cannot copy content of this page

Scroll to Top