Dr. Sathi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపించే పాలన

TRINETHRAM NEWS

మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరుకి వస్తున్నారని తెలిసి… ప్రభుత్వం జేసీబీ,లతో రోడ్లు తవ్వించింది… లాఠీలతో ప్రజల్ని బయపెట్టాలని చూసింది… బారికేడ్లతో ప్రజాస్వామ్యాన్ని కట్టేసింది…

కానీ… మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే – జగన్ మోహన్ రెడ్డి,ని ప్రేమించే హృదయాల మీద ఎలాంటి గోతులూ తవ్వలేవు,చంద్రబాబు

ఇది పర్యటన కాదు,
ఇది ప్రజల గుండెలో కొలువు తీరిన నాయకుడి ఊపిరి!
ప్రజల చైతన్యాన్ని పోలీస్ దళాలతో అణచాలని చూస్తే,
ప్రతిసారీ ప్రజల ప్రేమ తుఫానుగా మారి మిమ్మల్ని కొట్టేస్తోంది.
నెల్లూరులో ఇది పర్యటన కాదు – ఇది హెచ్చరిక కాదు… ఇది ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు,

ప్రభుత్వం వణికింది… ప్రజలు వాళ్ళకున్న మార్గాల నుంచి పరుగులు తీశారు.
రోడ్లు మూసివేశావ్… ప్రజలు పొలాల నుంచి దూసుకొచ్చారు!
లాఠీ ఎత్తావ్… ప్రజలు భయపడకుండా ముందుకెళ్లారు!
జేసీబీ, ల ద్వారా రోడ్లు తవ్వావ్… ప్రజలు గుండెల్ని తవ్వి తమ ప్రేమని చూపించారు!
ఇది పర్యటన కాదు బాబు…
ఇది ప్రజల గుండెలో ప్రతిఫలించే నాయకత్వ సందడి!
సత్తెనపల్లి స్పార్క్ అయితే…
బంగారుపాళ్యం అగ్నికనిక…
నెల్లూరు అగ్ని గోళం అయితే…
రాజమండ్రి అణుబాంబ్ అవుతుంది!
బారికేడ్లు పెడతావా? జనం ఎక్కేస్తారు!
జేసీబీ,లు తీసుకొస్తావా? జనం ఆగరు!
పోలీసులు మోహరిస్తావా? జనం వణకరు!
ఎందుకంటే ఇది జగన్ గారిపై ఉన్న అపారమైన విశ్వాసం…
అది మీ భయాల కంటే శక్తివంతమైనది!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Emergency-like rule

You cannot copy content of this page

Scroll to Top