Collector koya : రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

17ఎల్, 27 ఎల్ క్రింద పాలకుర్తి ,అంతర్గం మండలం లోని 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ

ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి పర్యటనకు అవకాశం

రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అంతర్గాం , జూలై-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం ముర్మురు లో ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో క్రీడా ప్రాంగణం, అంబేడ్కర్ చౌరస్తాలో మైదానంలో రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,  అంతర్గాం మండలం ముర్మూరు ప్రాంతంలో ఎస్సారెస్పీ కాల్వలు 17ఎల్, 27 ఎల్ క్రింద పాలకుర్తి ,అంతర్గం మండలం లో ఉన్న 13,386 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తయిందని,

ఈ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు ఆగస్టు 3న పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రుల పర్యటనకు అవకాశం ఉందని, రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబరాలు వంటి కార్యక్రమాలను ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, ఈ ఈ ఎల్లంపల్లి స్వామి, తహసిల్దారులు రవీందర్, ఈశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Arrangements for the commencement of

You cannot copy content of this page

Scroll to Top