Trinethram News : కడియం మండలం కడియపులంక మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి పరిశీలించారు.వచ్చే నెల పదిన ఈ గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామంలో ఏర్పాటు చేసే పోలింగ్ బూత్ లను ఆమె తనిఖీ చేశారు. మొత్తం 15,165 ఓట్లు ఉండగా వీటికి 36 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు డిపీవొకు వివరించారు.
అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, లైటింగ్, వైద్య సేవలు ఏర్పాటు చేయాలని డిపివొ శాంతామణి సూచించారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ ఎలా జరిగుతుందనేది పరిశీలించారు. నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు వాడకం అరికట్టానికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం పంచాయతీ కార్యాల వద్ద సచివాలయ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామ పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో నల్లం శ్రీనివాస్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


