Uttarandhra Leaders : ఉత్తరాంధ్ర నేతలకు గౌరవం చంద్రబాబుతోనే సాధ్యం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు) నియోజకవర్గఇంచార్జ్ : ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా, అక్కడి నాయకులకు గౌరవం కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీనే ముందుందని, రాష్ట్ర కార్యదర్శి , జి సి సి మాజీ చైర్మన్ యం వి వి ప్రసాద్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉత్తరాంధ్రకు మంచి రోజులు మళ్లీ వచ్చాయని అన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ పదవిని రావడం, కింజరపు రామ్మోహన్ నాయుడు ను కేంద్ర విమానయాన మంత్రిగా ఎంపిక చేయడం, సామాన్య కుటుంబానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడును ఎంపీగా అవకాశం ఇవ్వడం వంటి ఘనతలు టీడీపీకి మాత్రమే చెల్లుతాయన్నారు.

అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్రలో విద్యా సంస్థలు, ఆలయాల అభివృద్ధికి వేల ఎకరాల భూములను దానంగా ఇచ్చారని గుర్తు చేస్తూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

గతంలో నారా లోకేష్ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేసినా, జగన్ ప్రభుత్వం వాటిని తొలగించిందని తెలిపారు. కానీ నేడు చంద్రబాబు నాయకత్వంలో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్లు విశాఖకు రావడం, ఐటీ సెజ్, ఎన్టీపీసీ గ్రీన్, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో నెలకొనడం గర్వకారణమన్నారు.

ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల నాయకత్వం వల్లే సాధ్యమైందని, ఉత్తరాంధ్ర ప్రజలపై వారు చూపుతున్న ఆదరణ, అభిమానానికి ఇది నిదర్శనమని యం వి వి ప్రసాద్ అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Respect for Uttarandhra leaders

You cannot copy content of this page

Scroll to Top