అరకు డిగ్రీ కాలేజీలో పాడేరు డిఎస్పి సందేశం
అల్లూరుజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు, జూలై 26 : అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం డ్రగ్స్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. హిమగిరి ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులు గంజాయి, సారా, గుట్కా వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
సీఐ హిమగిరి మాట్లాడుతూ విద్యార్థులు చదువులో మెరుగులు దిద్దుకొని తమ కుటుంబాలకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, ర్యాగింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వంటి దురాచారాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, ప్రిన్సిపాల్, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


