అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రత , పారిశుధ్యం వంటి పలు అంశాలు పై వార్షిక సర్వే చేపడుతున్నట్టు జిల్లా కో ఆర్డినేటర్ బి. పద్మిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పొలమూరు లో ఎంపిడివో ఎమ్. రామకృష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపిడివో శ్రీకాంత్ రెడ్డి, అధికారులు పర్యటించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా గ్రామాల్లో పర్యటించి పలు విభాగాల్లో పారిశుద్ధ్య సంబంధిత అంశాలను గుర్తించి వాటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మండల పరిధిలో మూడు గ్రామాలను ఎంపిక చేయగా శుక్రవారం మూడు బృందాలు కొప్పవరం, పొలమూరు , మహేంద్రవాడ గ్రామాల్లో పర్యటించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఆలయాలు, జనావాసాలు వద్ద మరుగుదొడ్లు, డ్రైనేజి వ్యవస్థ, పరిసరాల పరిశుభత్ర వంటి పలు అంశాలను అధికారులు తనిఖీ చేసారు. వివిధ అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఏటా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుందని దీనిలో భాగంగానే గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి జి . నాగ సుబ్రహ్మణ్యం, డిపిఓ కార్యాలయ రిసోర్స్ పర్సన్ సతీష్, సచివాలయ అధికారులు, సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


