వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్ర0 న్యూస్ :, కొడంగల్, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 25 సీనియర్ రెసిడెంట్ మరియు 15 ట్యూటర్ పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో (హానరారిమ్ బేసిస్) భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
విద్యార్హతలు: సీనియర్ రెసిడెంట్ పోస్టు కొరకు విద్యార్హతలు MD/MS/DNB, సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ ఉత్తీర్ణతగా ఉండాలి. గౌరవ వేతనం రూ.92,575/- మరియు ట్యూటర్ పోస్టు కొరకు విద్యార్హతలు MBBS కాగా, అనాటమీ, ఫిజియాలజీ మరియు బయో కెమిస్ట్రీ విభాగాల్లో ట్యూటర్ పోస్టులకు MBBS లేదా మెడికల్ MSc అర్హత కలిగినవారు అప్లై చేయవచ్చు.
ఈ పోస్టులకు గౌరవ వేతనం రూ.57,700/-. అర్హత కల వైద్య అభ్యర్థులు 28-07-2025 వ తేదీన ఉదయం 9-00 గంటల నుండి సాయంత్రం 4-00 గంటల వరకు IDOC కార్యాలయం కలెక్టరేట్ వికారాబాద్ జిల్లా లోనిర్వహించబడుతున్న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావలెను.పై పోస్టులను ఎంపిక కమిటీ నిబంధనల ప్రకారం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
ఈ విషయాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు.
ప్రిన్సిపాల్
ప్రభుత్వ వైద్య కళాశాల
కొడంగల్, వికారాబాద్ జిల్లా.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


