ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 19 – 01 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,
తిథి : నవమి రా11.33 వరకు,
నక్షత్రం : అశ్విని ఉ7.14 వరకు,
తదుపరి భరణి తె6.22వరకు,
యోగం : సాధ్యం సా4.52 వరకు,
కరణం : బాలువ మ12.23 వరకు,
తదుపరి కౌలువ రా11.33 వరకు,
వర్జ్యం : సా4.29 – 6.02,
దుర్ముహూర్తము : ఉ8.52 – 9.36 &
మ12.33 – 1.18,
అమృతకాలం : రా1.44 – 3.17,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.39,
సూర్యాస్తమయం: 5.44,
నేటి మాట
భక్తుని – ఆధ్యాత్మిక ఉన్నతికి – ప్రాధమిక సూత్రాలు…!!
ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా దైవ నామ జపం చేయాలి…
నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి,
విన్న మంచి మాటలను ఆచరించి, సత్శీలంతో జీవించాలి…
ఈ సూత్రాలు పాటించకుండా ఎవరూ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు…
మనసులో వ్యాపకాలు పెరిగే కొద్దీ దైవ నామ స్మరణ తగ్గిపోతుంది…
వంద వ్యాపకాలలో… దైవస్మరణ ఒకటి ఐతే… దైవ దర్శనం సులభ సాధ్యం కాదు…
ఏ వ్యాపకమైనా సంతోషంగానో, దుఖంగానో ముగుస్తుంది…
నిజానికి సంతోషం, దుఃఖం క్షణికానుభవాలు.
కానీ... సంతోషాన్ని కావాలనుకోవటం, దుఃఖాన్ని వద్దను కోవటం చేత అవి మరింత విస్తృతమై, శాంతిని దూరం చేస్తున్నాయి…
ప్రతి పనిలోనూ త్రికరణశుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది.
అలా ఉన్న మనసుకు ఆశ, కోరిక, సంతోషం, దుఃఖం ఏవైనా క్షణికానుభవాలే అవుతాయి…
అందుకే వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించ గలుగుతుంది!!…
ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మిక సాధన చేయ్యాలి…
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు