Mahadharna : జూలై 26 న ఎన్ హెచ్ ఎం నాలుగవ తరగతి ఉద్యోగులు మహాధర్నా

TRINETHRAM NEWS

జగిత్యాల జిల్లా 21-జులై: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం లో జూలై 26న నిర్వహించనున్న ఎన్ హెచ్ ఎం నాలుగవ తరగతి ఉద్యోగుల మహాధర్నాను జయప్రదం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఎన్ హెచ్ ఎం నాలుగో తరగతి ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

సోమవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… జూలై 26 శనివారం రోజున జరిగే ఎన్ హెచ్ ఎం నాలుగో తరగతి సిబ్బంది ఉద్యోగులంతా ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ నాలుగవ తరగతి ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని రామ రాజేష్ ఖన్నా ఉద్యోగులకు పిలుపునిచ్చారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NHM Class IV employees

You cannot copy content of this page

Scroll to Top