Awareness Seminar : రోడ్డు ప్రమాదాల నివారణకు డిండిపోలీసు వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 18త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నల్గొండ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు నేడు స్థానిక స్టేషన్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో నల్గొండ పోలీస్ కళాబృందం వారిచే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
స్టేషన్ హౌస్ఆఫీసర్ రాజు మాట్లాడుతూ చిన్నపిల్లల కు(మైనర్ )వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని, చిన్న చిన్న పొరపాట్లు జరిగిన తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తల్లిదండ్రులకు హెచ్చరించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు అధికంగా సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల మధ్యన జరుగుతాయని అలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ గంజాయి మాదకద్రవ్యాలు అధికంగా వినియోగిస్తున్నారని యువకులు విద్యార్థులు వాడుతున్నారని మా దృష్టికి వచ్చిందని ఇప్పటినుండి చాలా జాగ్రత్తగా పోలీస్ ఆధ్వరంలో తగు చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. మరియు ద్విచక్ర వాహనాలు నడిపే క్రమంలో తలకు హెల్మెట్ వాడాలని హెల్మెట్ ద్వారా ప్రాణహాని జరగదని సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మండల ప్రజలు యువతి యువకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness seminar under the

You cannot copy content of this page

Scroll to Top