Buchi Reddy : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా బుచ్చిరెడ్డి ఎన్నిక

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 16 త్రినేత్రం న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)నల్లగొండ జిల్లా 23వ, మహాసభలు మంగళవారం దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్లో జరిగాయి.ఈ మహాసభలో డిండి మండలంలోని రహమంతాపూర్ గ్రామానికి చెందిన సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూం బుచ్చిరెడ్డి ని జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన తూం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం పాలక ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించెందుకు క్యాడర్ ను సిద్ధం చేస్తూ పార్టీ ఇచ్చే పిలుపులో భాగంగా కార్యక్రమాలను ద్విగ్విజయం చేయనున్నట్లు బుచ్చిరెడ్డి తెలిపారు.
బుచ్చి రెడ్డి ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరియు సిపిఐ పార్టీ మండల పార్టీ నాయకులు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Buchi Reddy elected as

You cannot copy content of this page

Scroll to Top