Lift Accident : లిఫ్ట్ ప్రమాదానికి గురై 14 మందికి గాయాలు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 15 : బీరంగుడాలోని దుస్తుల దుకాణంలో ట్యాగులు తొలగించే పనికి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి వెళ్లిన పద్నాలుగు మంది వస్త్ర దుకాణంలో లిఫ్ట్ ప్రమాదానికి గురై మెరిడియాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళలను యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ చికిత్స పొందుతున్న వారందరు దైర్యంగా ఉండాలని అన్నారు. బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్ తో యువనేత మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రమాదానికి గురైన వారికి సిమెంట్ పట్టి వేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నట్లు, ఒకరికి సర్జరీ అవరసం అని డాక్టర్ శైలేకర్ రెడ్డి తెలిపినట్లు చెప్పారు. విషయాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ మరియు ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లామని, వారు కూడా హాస్పిటల్ డాక్టర్ మరియు సి.ఐ గార్లతో మాట్లాడుతూ బాధితుల ఆరోగ్య పరిస్తితులను ఆరా తీస్తున్నారని తెలియచేసారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

14 injured in lift

You cannot copy content of this page

Scroll to Top