Manali Thakur : ఆషాఢ మాస గోరింటాకు సంబరాల్లో పాల్గొన్న మనాలి ఠాకూర్

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఆర్జీ 2 – 8వ కాలనీలోని NCOA క్లబ్ లో, సింగరేణి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబరాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మరియు మక్కాన్ సింగ్ సేవాసమితి చైర్మన్ మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ “ఆషాఢ మాసం మహిళల ఆధ్యాత్మికత, అనుసంధానానికి ప్రతీక.

ఈ సందర్బంగా నిర్వహించే గోరింటాకు వేడుకలు మహిళల సామూహికతను, సాంస్కృతిక విలువలను పదిలంగా కాపాడే కార్యాచరణగా నిలుస్తాయి,” అని పేర్కొన్నారు క్లబ్ సభ్యులందరితో సౌహార్దపూర్వకంగా మమేకమైన వారు, గోరింటాకు వేయించుకొని వారితో సంబురాల్లో భాగమయ్యారు. మహిళలు కూడా వారికి సాదర స్వాగతం పలుకుతూ, తమ అభిప్రాయాలను పంచుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Manali Thakur participated in

You cannot copy content of this page

Scroll to Top