Minors is a Crime : మైనర్ల డ్రైవింగ్ చట్టారీత్యా నేరం

TRINETHRAM NEWS

మైనర్ల డ్రైవింగ్ పై దేవరకొండ పోలీసుల ప్రత్యేక దృష్టి.

మైనర్లు వాహనం నడిస్తే 25 వేల జరిమానా.

మద్యం తాగి వాహనం నడిపే కఠిన చర్యలు.

అతివేగం అనర్ధాలకు మూలం.

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి పోలీసులకు సహకరించండి.
సిఐ నరసింహులు దేవరకొండ జులై 12 త్రినేత్రం న్యూస్. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావద్దని మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని దేవరకొండ సీఐ నరసింహులు అన్నారు. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మైనర్ లు వాహనాలు నడిస్తే 25 వేల జరిమానా, వాహన యజమాని తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నిర్మూలించే ప్రయత్నంలో సీఐ నరసింహులు అడిషనల్ ఎస్పీ మౌనిక ఐపీఎస్ సూచనల మేరకు ప్రతినిత్యం దేవరకొండ పట్టణంలో పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వాహన చట్టంలో కీలక మార్పులు తీసుకొచ్చింది అని మైనర్ లు వాహనాలు నడిపితే భారీ జరిమానా విధించడమే కాకుండా పోలీస్ నిబంధనల ప్రకారం శిక్ష పడుతుందని తెలిపారు. కావున నిబంధనలకు లోబడి వాహనాలు నడపాలని తెలిపారు.
అధిక శబ్దాలు చేస్తూ వాహనాలు నడిపితే, ఎదుటివారిని భయభ్రాంతులకు గురి చేసిన వాహనాలకు, నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై నడిపితే ఎవరిని ఉపేక్షించబోవు అని తెలిపారు. రోడ్డు ప్రయాణం చేసే వాహన చోదకులు సరైన వాహనపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Driving by minors is

You cannot copy content of this page

Scroll to Top