పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రాంగణంలో వన మహోత్సవం -2025 కార్యక్రమం కింద మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జూలై 11: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావుతో కలిసి వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పరిసరాలలో పచ్చదనం పెంచే దిశగా మనమంతా సంయుక్తంగా కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి వాటినీ సంరక్షించాలని అన్నారు. పెద్దపల్లి పట్టణంలో బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ లో ఎత్తైన మొక్కలు నాటాలని, వాటికి తప్పనిసరిగా ట్రీ గార్డ్ వంటివి ఏర్పాటు చేయాలని, రెగ్యులర్ వాటరింగ్ కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ మొక్కలను కాపాడటం మనందరి బాధ్యతగా ప్రజలు ముందుకు రావాలని, మన పనిగా భావించి మొక్కలను పెంచాలని, అప్పుడే గ్రీనరీ పెరుగుతుందని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు ఎన్ని బతుకుతున్నాయి అనేది కీలకమని అన్నారు ప్రస్తుతం నాటుతున్న 550 మొక్కలు వచ్చే సంవత్సరం నిర్వహించే వన మహోత్సవం నాటికి కూడా బతకాలని అన్నారు. ఐ.టీ.ఐ లో వాకర్స్ ఎక్కువగా ఉన్నారని, వీరి సౌకర్యార్థం లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ను కోరారు. 10 లక్షల నిధులు మంజూరు చేసి వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
పెద్దపెల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లో నూతనంగా జరిగిన రొడ్డు నిర్మాణాల వెంబడి మొక్కలు నాటాలని అన్నారు ఈ సమావేశంలో పెద్దపల్లి వ్యవసాయ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, సుల్తానాబాద్ వ్యవసాయ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, జిల్లా అటవీ అధికారి శివయ్య,ఆర్టీవో రంగారావు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసిల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


