త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా లో 2015 సంవత్సరం లో పరిగి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 142/2015 ,అండర్ సెక్షన్ హత్య సెక్షన్ 302 ఐపీసీ మరియు హత్యాయత్నం సెక్షన్ 307 ఐపీసీ ల క్రింద నమోదైన కేసులో ముగ్గురు నిందితులకు వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు సెక్షన్ 302 IPC హత్య లో నిందితులకు ఒక్కొకరికి జీవిత ఖైదు మరియు 3000 రూపాయల జరిమానా మరియు 307 IPC హత్యాయత్నం rw 34 లో నిందితులకు ఒక్కొకరికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 2000రూపాయల జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించవలసి ఉంటుంది విధించడం జరిగింది అని జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS తెలియజేయడం జరిగింది.
అట్టి కేసుకు సంబంధించిన వివరాలు ఇట్టి విధంగా ఉన్నాయి.ఈ కేసులో ఫిర్యాది గొల్ల బిచ్చన్న బావ పరిగి మండలం బొంపల్లి గ్రామస్తుడైన ముద్దమ్ శ్రీనివాస్ ను పాత భూమి గొడవలు మనసులో పెట్టుకొని తేది 17.07.2015 రోజున వారి పాలివరైన ఏ1: ముద్దం గోపాల కృష్ణయ్య అలియాస్ కృష్ణయ్య, ఏ2: నిడూరం అంజిలయ్య, ఏ3: నిడూరం నరసమ్మలు, ముద్దం శ్రీనివాస్ పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ పూర్ గ్రామం లో తమకు ఉన్న పొలం లో పని చేస్తుండగా నిందితులు వచ్చి భూమి విషయం లో గొడవపడి ముద్దమ్ శ్రీనివాస్ మరియు ఆయన తండ్రి ని ఇనుప కర్రు, కట్టెలతో కొట్టగా ఫిర్యాదు దారుని బావ అయిన ముద్దం శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయినాడు అని పిర్యాదుమేరకు అప్పటి పరిగి ఎస్ఐ వై. నాగేశ్ ఎస్.ఐ. పరిగి పి.ఎస్., ప్రస్తుతం సి.ఐ.పి. తాండూరు రూరల్ మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహరించి కేసు నమోదు చేయడం జరిగింది. రెండవ దర్యాప్తు అధికారిగా అప్పటి పరిగి సిఐ పి. ప్రసాద్ ప్రస్తుతం సి.ఐ.పి. నందిగామ పి.ఎస్. ఇట్టి కేసులో దర్యాప్తు పూర్తి చేసి గౌరవ జిల్లా కోర్ట్ నందు చార్జ్ షీట్ సమర్పించగా జిల్లా గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి వాదోవవాదనలు విన్న తర్వాత నిందితులకు శిక్ష విధించడం జరిగింది. శిక్ష పడిన నిందితులు:
• ఏ1: ముద్దం గోపాల కృష్ణయ్య అలియాస్ కృష్ణయ్య తండ్రి: ముద్దం రామయ్య, వయస్సు: 38 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: బొంపల్లి గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా
• ఏ2: నిడూరం అంజిలయ్య తండ్రి: దివంగత రామయ్య, వయస్సు: 42 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: బొంపల్లి గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా
• ఏ3: నిడూరం నరసమ్మ భర్త: అంజిలయ్య, వయస్సు: 36 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: బొంపల్లి గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లా
పైన పేర్కొన్న ముగ్గురు నిందితులకు సెక్షన్ 302 IPC హత్యలో నిందితులకు ఒక్కొకరికి జీవిత ఖైదు మరియు 3000 రూపాయల జరిమానా మరియు 307 IPC హత్యాయత్నం rw 34 లో నిందితులకు ఒక్కొకరికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 2000రూపాయల జరిమానా విధించబడింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించవలసి ఉంటుంది.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాల సేకరణ ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ అధికారులు అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. సుధాకర్ రెడ్డి, మొదటి దర్యాప్తు అధికారి వై. నాగేశ్ అప్పటి ఎస్.ఐ. పరిగి పి.ఎస్., ప్రస్తుతం సి.ఐ.పి. తాండూరు రూరల్, రెండవ దర్యాప్తు అధికారి ప్రసాద్ సి.ఐ.పి., ప్రస్తుతం సి.ఐ.పి. నందిగామ పి.ఎస్., బ్రీఫింగ్ అధికారి N. శ్రీనివాస్ డి.ఎస్.పి. పరిగి, ఎస్. శ్రీనివాస్ రెడ్డి సి.ఐ.పి. పరిగి, ఎం. సంతోష్ కుమార్ ప్రస్తుత పరిగి ఎస్.ఐ.పరిగి PS కోర్ట్ డ్యూటి అధికారి పి. జగన్ మోహన్ రెడ్డి, లైజన్ ఆఫీసర్ బి. వీరన్న ఎస్.ఐ. లను జిల్లా ఎస్పీ అభినందించినారు.
ఈ తీర్పు నేరస్తులకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని ఈ తీర్పు రుజువు చేస్తుందని వారు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


