ముత్తారం , జూలై-10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, పల్లె దవాఖానా (సబ్ సెంటర్), మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, లక్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పారుపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, చెంచుల శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, అడవి శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఖమ్మం పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ఓడేడు ఖమ్మం పల్లి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, ముత్తారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం, ఐకేపీ కేంద్రంలోని చిల్లి సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మచ్చుపేట గ్రామం లోని ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పల్లె దవాఖాన ద్వారా గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రాథమిక వైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు పారుపల్లి గ్రామం లోని ఎం.పీ.పీ.ఎస్ పాఠశాలలో నూతన అడ్మిషన్లు కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులు తీసుకున్నారు. పాఠశాలలో నూతన ప్రీ ప్రైమరీ క్లాసును ప్రారంభించారు. అభివృద్ధి కోసం అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలు అందించాలని అన్నారు. పారుపల్లి ఎంపియూపిఎస్ పీఎం శ్రీ క్రింద ఎంపికైందని, దీని అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
చెంచుల ఎస్టీ కాలనీలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించిన కలెక్టర్ అర్హత ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అడవి శ్రీరాంపూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ లను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా గ్రామాలలోని డిజిటల్ క్లాసుల పనితీరు మరియు ఉపాధ్యాయులు బోధించే బోధనా సరళి నీ పరిశీలించి విద్యార్థులతో డిజిటల్ క్లాసులపై విద్యార్థులు నేర్చుకున్న వాటిని డిజిటల్ క్లాసుల ద్వారా వివరించారు. ఐకేపి కార్యాలయంలో ఏర్పాటు చేసే చిల్లి సెంటర్ ను లాభసాటి గా నడపాలని, మహిళా సంఘాల ద్వారా కారంపొడి తయారు చేసి విక్రయించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.డి.ఓ. కాళిందిని, ముత్తారం ఎంపిడిఓ సురేష్, ఐకేపి ఏపిఎం పద్మ, ఏఈ పంచాయతీ రాజ్ జగదీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


