MLA Jare : జాతీయ విద్య-ఆరోగ్య సదస్సులో పాల్గొననున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం. న్యూఢిల్లీ: ఈ నెల జూలై 10, 11 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి విద్య మరియు ఆరోగ్య లెజిస్లేటివ్ సదస్సులో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ పాల్గొననున్నారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుండి ఎంపికైన శాసనసభ్యులు పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో విద్యా మరియు ఆరోగ్య రంగాల అభివృద్ధికి సంబంధించి ఆలోచనలు అనుభవాలు పంచుకోనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ
మన గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, ఆరోగ్య రంగాల్లో ఎదురవుతున్న సమస్యలను జాతీయ వేదికపై వినిపించేందుకు అశ్వారావుపేట నియోజకవర్గం తరపున అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమర్థవంతమైన పరిష్కారాల కోసం ఈ సమావేశం చాలా ఉపయోగపడనుందన్నారు.
ఈ విధమైన కార్యక్రమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సమన్వయం పెరిగి రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Aswaraopet MLA Jare to

You cannot copy content of this page

Scroll to Top