NHM : కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ గురి చేస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు

TRINETHRAM NEWS

హైదరాబాద్ జిల్లా 09 జులై త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)లో గత 25 ఏళ్లగా పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వ కుండా శ్రమదోపిడీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు ఎన్హె హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ జిల్లా నుంచి పల్లె వరకు అన్నిస్థాయిలో రాష్ట్రంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్. హెచ్ .ఎం. ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. నర్సింహ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న 78 క్యాడర్స్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ జూన్ 28న ఎన్హెచ్ఎం డైరెక్టరేట్ కార్యాలయం లో సమ్మె నోటీస్ ఇచ్చాము. కానీ ఎలాంటి పరిష్కారం కాలేదు. కావున ఈరోజు మహాధర్నా ఇందిరాపార్క్ లో నిర్వహించడం జరిగింది.. ముఖ్యమైన 8 డిమాండ్స్ గురించి జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ..ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత పీఆర్సీ. సందర్భంగా రావాల్సిన ఏడు నెలల పీ ఆర్ సి ఏరియర్స్ నేటికీ అందలేదన్నారు.

సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సిద్దిపేట రాజేశ్వరి రెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరియు పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఎల్. సురేష్ నాయక్ జనగామ జిల్లా అధ్యక్షురాలు గంగరబోయిన జ్యోతి, పల్లె దావఖన డాక్టర్స్ డాక్టర్ పుట్ట మహేందర్ రావు, డాక్టర్ శ్రీనివాసు ,డాక్టర్ దయానంద్ ,డాక్టర్.వినయ్,మేడ్చల్ జిల్లా ట్రెజరర్ పార్థసారథి, నవీన్,2 వ ఏఎన్ఎంలు శ్యామల, ఎమ్.ఎల్.హెచ్.పి. నల్లగొండ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జనగాం జిల్లా , ఎం .ఓ.అసిస్టెంట్ దిలీప్ కుమార్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఎన్. శ్రీనివాస్, అకౌంటెంట్ మమత, నరసింహులు, సపోర్టింగ్ స్టాఫ్ అశోక్,శ్రీనివాస్ సాంబరాజు ,రామనాథం మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The central and state

You cannot copy content of this page

Scroll to Top