Public Problem : ప్రజా సమస్యల పరిష్కార సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :మర్పల్లి, బంట్వారం మండల కేంద్రాలలోని MPDO కార్యాలయాలలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార సమావేశాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల ప్రభుత్వ శాఖలఅధికారులు, ప్రజలు. మర్పల్లి లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్. వనమహోత్సవంలో భాగంగా మర్పల్లి, బంట్వారం లలో మొక్కలను నాటిన సభాపతి ప్రసాద్ కుమార్ ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ.వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా ఆశయం, లక్ష్యం. గత శాసనసభ ఎన్నికల్లో నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి అహర్నిశలు పనిచేస్తాను. ప్రజలు తమ సమస్యలను నాతో చెప్పడానికి హైదరాబాద్, వికారాబాద్ వచ్చి ఇబ్బందులు పడకుండా నేనే వారి వద్దకు వచ్చి క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడానికి మర్పల్లి,బంట్వారం మండలాల ప్రజలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చాను.ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తక్షణం పరిష్కారం అవ్వడంతో పాటుగా, ప్రజలకు రవాణా ఖర్చులు, సమయం వృధా కాదు.గత ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన విదంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తాను.
ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలి. స్థానిక నాయకులు ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. లబ్ధిదారులకు అందరికీ న్యాయం జరగాలి. గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో సగం మిత్తీలు, వాయిదాలకే పోతుంది. రేవంత్ రెడ్డి సమర్ధుడు కాబట్టి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మెజారిటీ హామీలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమ కోసం బడ్జెట్లో నిధులను కేటాయిస్తున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నాయి. విడతల వారిగా అందరికీ ఇళ్ళు వస్తాయి.తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి పని చేస్తూ‌, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State Legislative Assembly

You cannot copy content of this page

Scroll to Top