తాడేపల్లి వార్తలు.. జనవరి 18.
38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన.
అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్ మొదలైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె నేటికి 38 వ రోజుకు చేరుకుంది. తాడేపల్లి మండల కేంద్రం నులకపేట తాసిల్దార్ కార్యాలయం సమ్మె శిబిరం వద్ద సామూహిక ప్రార్థనలు చేసి నిరసన తెలిపారు.
సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, ఎపి రైతు సంఘం మండల కార్యదర్శి మోదుగుల శ్రీనివాసరెడ్డి, సిఐటియు నాయకులు దర్శనపు విజయ్ బాబు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సమ్మెకు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) మంగళగిరి ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సరళ, తబితా, కిరణ్మయ్, మాణిక్యం, శ్రీదేవి, భవాని, సుజాత, లక్ష్మి, శోభా, వరలక్ష్మి, ఫాతిమా, మాధురి తదితరులు నాయకత్వం వహించారు.
38 వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె – సామూహిక ప్రార్థనలతో నిరసన
Related Posts
భవిష్యత్ రోజుల్లో పార్టీ నిర్మాణానికి పార్టీలో విశ్వసనీయతకు పార్టీ సిద్ధాంతాలకు లోబడి అధిష్టానం సూచనలతో ముందుకెళతా. – డా. వంపూరు గంగులయ్య.
TRINETHRAM NEWS భవిష్యత్ రోజుల్లో పార్టీ నిర్మాణానికి పార్టీలో విశ్వసనీయతకు పార్టీ సిద్ధాంతాలకు లోబడి అధిష్టానం సూచనలతో ముందుకెళతా. – డా. వంపూరు గంగులయ్య. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్: అల్లూరి సీతారామరాజు జిల్లా జనసేన…
జనసేన నేత వంపూరు గంగులయ్య పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
TRINETHRAM NEWS జనసేన నేత వంపూరు గంగులయ్య పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్: అల్లూరి సీతారామరాజు జిల్లాపాడేరు,జి.మాడుగుల,చింతపల్లి,గూడెం,కొయ్యూరుపాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ 5మండలాల అధ్యక్షుల సంయుక్త ప్రకటన.గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ…