Key Orders : కీలక ఆదేశాలు

TRINETHRAM NEWS

తేదీ : 06/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో విద్యార్థులు మూడు రోజులకు మించి పాఠశాలకు రాకపోతే తక్షణమే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఐదు రోజుల కంటే ఎక్కువ పాఠశాలకు రాకపోతే ఎంఈఓ, సిఆర్పీలు , ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళాలని సూచించడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టాలని తెలిపింది. ఉపాధ్యాయులు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నా యం ఏర్పాటు చేయాలని , అకాడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key orders

You cannot copy content of this page

Scroll to Top