రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ప్రజలపై పెద్దమ్మ తల్లి ఆశీస్సులుండాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అమ్మవారిని వెడుకున్నారు. పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా అదివారం మాజీ ఎమ్మెల్యే పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. అమ్మవారి కరుణ కటాక్షం ప్రజలందరిపై ఉండాలని, అందరిని చల్లగా చూడాలన్నారు. ఆలయ కమిటి చందర్ శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమం లో నాయకులు నారాయణదాసు మారుతి సట్టు శ్రీనివాస్ కొడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


