TRINETHRAM NEWS

పాత 2రూపాయల నాణెం ఇస్తే రూ.31 లక్షలు ఇస్తామంటూ వృద్ధుడికి పంగనామం పెట్టిన…. సైబర్ నేరగాళ్లు

Trinethram News : తమ వద్ద పాత రూ.2 కాయిన్స్ లేదా రూ.5 కాయిన్స్ ఉంటే తమకు ఇవ్వాలని దానికి బదులుగా లక్షల రూపాయలు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారం చేశారు. వీడియో తిలకించిన ఒక వృద్ధుడు అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు. బెంగళూరులోని ఉల్సూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పాత కాయిన్స్ 1980,1990 నాటి కాలంలో చలామణి అయినవి.. వీటిపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బొమ్మతో పాటు భారత మ్యాప్ సైతం ఈ పాత కాయిన్స్ మీద ఉంటుంది . బాధితుడు వద్ద ఉన్న పాత కాయిన్స్ కు అక్షరాల రూ.31 లక్షల రూపాయలు వస్తుందని నమ్మించారు

కొద్దిసేపటి తర్వాత రకరకాల పేర్లు, టాక్స్ ల నిబంధనలు చెప్పి బాధితుడు ఖాతా నుండి 2.3 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు లాగేశారు. అయితే మరికొంత డబ్బు పంపించాలని నేరగాళ్లు కోరడంతో బాధితుడికి అనుమానం కలిగింది. దీంతో బాధితుడు డబ్బు పంపడం ఆపేసాడు. బాధితుడు నుండి డబ్బు రాకపోవటంతో అలర్ట్ అయ్యారు నిందితులు .. వెంటనే ముంబై పోలీస్ పేరుతో ఒక ఫేక్ కాల్ చేశారు. తాము ముంబై పోలీస్ నని మీ మీద మనీలాండరింగ్ కింద కేసు నమోదు అయిందంటూ బాధితుడిని నమ్మించాడు. ఒక ఫేక్ వీడియో కాల్స్ సైతం బాధితుడికి చేసి అందులో ఫేక్ కాప్స్ మాదిరి బాధితుడిని భయపెట్టారు. చేసేది లేక స్థానిక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం అత్యాశకు పోయి సోషల్ మీడియాలో వీడియో చూసి తానే డబ్బులు పోగొట్టుకున్నట్టు ఉల్సూర్ పోలీసులను ఆశ్రయించాడు.