దేశ వ్యాప్తంగానూ అదే పరిస్థితి
రాష్ట్రంలో మరో 5 రోజులు వానలు:వాతావరణ శాఖ
Trinethram News : హైదరాబాద్, జూలై 3 రాష్ట్రంలో ఈ నెల (జూలై)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం వెల్లడించింది.
అలాగే దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలున్నాయని వెల్లడించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం మహబూబాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సగటు వర్షపాతం 2 సెంటీమీటర్లు నమోదైనట్లు తెలిపింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. 7 వరకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


